సీఎం జగన్ కూతురుపై పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు !

సీఎం జగన్ కూతురుపై పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ముద్దుల మామయ్య అని.. తాను మామయ్యనని.. ముద్దుల పెడతానంటూ సీఎం జగన్ విద్యార్ధులకు చెప్పారన్నారు. ఇప్పుడేమో ఆ ముద్దుల మామయ్య ఫీజు చెల్లించడం లేదు…. విదేశీ విద్య ఆపేశారు.. ఫీజు రీ-ఇంబర్సుమెంట్ చేయడం లేదని విమర్శలు చేశారు.

సీఎం జగన్ కూతురు మాత్రం చదువుకుంటోందని… సీఎం కూతురు గురించి మాట్లాడ్డానికి సంస్కారం అడ్డొస్తోంది.. నేను మాట్లాడననన్నారు పవన్‌. గురజాలలో సీఎం జగనుకు చెందిన సరస్వతి పవర్ అండ్ మినరల్స్ సంస్థ భూములు తీసుకుంది.. పరిహరం ఇవ్వలేదనే ఫిర్యాదు చేశామని చెప్పారు.

మాట ఇస్తే మడమ తిప్పననే వాళ్లు విదేశాల్లో తిరుగుతున్నారు…రాజకీయం అంటే బూతులు తిట్టడం కాదని ఫైర్‌ అయ్యారు. సమస్యల పరిష్కారానికి మా వంతు ప్రయత్నం చేస్తామని… వ్యవసాయం, టిడ్కో ఇళ్లకు సంబంధించిన సమస్యలు ప్రధానంగా మా దృష్టికి వచ్చాయన్నారు. వాలంటీర్లు సంతకం పెట్టని కారణంగా కూడా పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు.