ఫోన్లు ట్యాపింగ్ కాదు…ఫోన్లు ట్రాకింగ్ చేశారు – మంత్రి పెద్దిరెడ్డి సంచలనం

-

ఫోన్ల ట్యాపింగ్ వివాదం పై పెద్దిరెడ్డి వివరణ ఇచ్చారు. ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు అని నేను చెప్పలేదు…ఫోన్లు ట్రాకింగ్ చేశారని ఫైర్ అయ్యారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఫోన్లు ట్యాపింగ్ చేయడమనేది క్రైం అనేది అందరికీ తెలుసని.. పేపర్ లీకేజీ కేసులో దాదాపు 60 మందికి పైగా నిందితులను పట్టుకున్నారన్నారు.

ఆ క్రమంలో ఎవరెవరు ఎవరితో మాట్లాడారో ట్రాక్ చేశారని.. ఆ విషయమే నేను చెప్పాను… చంద్రబాబు వయసుకు తగ్గట్లుగా ఆలోచనతో మాట్లాడటం లేదని వెల్లడించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడాన్ని చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారని.. మీటర్లు బిగుస్తే రైతుల గొంతులకు ఉరితాడు బిగించినట్లేనని వ్యాఖ్యానిస్తున్నారని మండిపడ్డారు.

పారదర్శకత కోసమే వ్యవసాయ పంపుసెట్లకు ప్రభుత్వం మీటర్లు బిగిస్తోందని.. ఈ నెలాఖరలోగా రైతుల పేరిట అకౌంట్లు ఓపెన్ చేసి అనుసంధానిస్తారన్నారు. వంద శాతం కరెంటు బిల్లుల మొత్తాన్ని రైతుల అకౌంట్‌లో ప్రభుత్వం జమ చేస్తుందని.. రైతులే నేరుగా డిస్కంలకు విద్యుత్ బిల్లులు కడతారని చెప్పారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మీటర్లు సక్సెస్ అయితే రైతులు తనకు ఓట్లేయరని చంద్రబాబు భావిస్తున్నారు.. రైతులను చంద్రబాబు రెచ్చగొడుతున్నారు.. చంద్రబాబు భాషను నేను మాట్లాడలేనని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news