పోలవరం ప్రాజెక్టు బండ్కు పగుళ్లు – ఎంపీ రఘురామ వివాదాస్పద పోస్ట్

-

పోలవరం ప్రాజెక్టుకు పగుళ్లు అంటూ ఎంపీ రఘురామ వివాదాస్పద పోస్ట్ పెట్టారు. పోలవరం బండ్ డిజైన్, నిర్మాణము చేసింది మెగా ఇంజనీరింగ్ సంస్థ అని, బండ్ కు పగుళ్లు ఏర్పడ్డాయి అంటే ఆ సంస్థ డిజైన్, నిర్మాణ లోపమే అయి ఉంటుందని, బండ్ కు పెద్ద ఎత్తున పగుళ్ళు ఏర్పడ్డప్పటికీ, ముఖ్యమంత్రి జగన్ గారు మాత్రం వెలుగులోకి తీసుకువచ్చిన మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు రఘురామ.

బండ్ నిర్మాణం అన్నది 81 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న నిర్మాణమని, స్పీల్ వే రక్షణ కోసం నిర్మించిన బండ్ ఇలా పగుళ్లు ఏర్పడితే ఎలా అని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్ పేరిట అనుభవం ఉన్న వారిని కాదని అనుభవం లేని వారికి కాంట్రాక్టు పనులు అప్పగించడం దురదృష్టకరమని, మెయిన్ బ్యారేజ్ కు ఏదైనా డ్యామేజ్ జరిగితే అసలుకే మోసం వస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోందని అన్నారు. బ్యారేజ్ కు డ్యామేజ్ కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించి రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుబడి పెట్టి నిర్మాణాన్ని పూర్తి చేయాలని, కేంద్రం నుంచి తరువాత నిధులను రాబట్టుకోవచ్చునని, బ్యారేజీకి డ్యామేజ్ కాకుండా చర్యలు తీసుకుంటే ప్రజలు హర్షిస్తారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version