2025 లో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు లిస్ట్ ను రిలీజ్ చేసింది టీటీడీ పాలక మండలి. దీని ప్రకారం.. వచ్చే ఏడాది శ్రీవారి ఆలయంలో రెండు సార్లు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. జనవరి 10 వ తేదిన మరియు డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినం ఉంటుంది. అరుదుగా ఒకే ఏడాదిలో రెండుసార్లు రానుంది వైకుంఠ ఏకాదశి.
జనవరి 10వ తేది నుంచి 19వ తేది వరకు మరియు డిసెంబర్ 30వ తేది నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనుంది టిటిడి.
తిరుమల….2025 లో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు*
- జనవరి 10 – వైకుంఠ ఏకాదశి
జనవరి 10 నుండి 19 వరకు పదిరోజులు పాటు వైకుంఠ ద్వార దర్శనం - ఫిబ్రవరి 4 – రథసప్తమి
- ఫిబ్రవరి 12 – రామకృష్ణ తీర్థ ముక్కోటి
- మార్చి 9 – 13 తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు
- మార్చి 14 – కుమారధార తీర్థ ముక్కోటి
- మార్చి 30 – శ్రీవారి ఉగాది ఆస్థానం
- ఏప్రిల్ 10 – 12 శ్రీవారి వసంతోత్సవాలు
- జూన్ 9 – 11 – శ్రీవారి జ్యేష్టాభిషేకం
- జూలై 16 – అనివార ఆస్థానం
- ఆగస్టు 4 -7 – శ్రీవారి పవిత్రోత్సవాలు
- సెప్టెంబర్ 24 – అక్టోబర్ 2 – తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
- డిసెంబర్ 30 – వైకుంఠ ఏకాదశి
- డిసెంబర్ 30 -08 జనవరి 2026వరకు – వైకుంఠ ద్వార దర్శనం.