సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ భేటీ…భారీ ఎత్తున పెట్టుబడులు !

-

సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. పారిశ్రామిక అభివృద్దికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, ప్రణాళికలు అందించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనుంది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం. దేశంలో పేరున్న పారిశ్రామిక వేత్తలు, ఆయా రంగాల నిపుణులతో ఏర్పాటు కానుంది టాస్క్ ఫోర్స్. సీఎం చైర్మనుగా, టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ కో చైర్మనుగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కానుంది. పారిశ్రామికాభివృద్దికి చేపట్టాల్సిన చర్యలపై పనిచేయనుంది టాస్క్ ఫోర్స్. అమరావతిలో సీఐఐ భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్ షిప్ సంస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థ ఏర్పాటులో భాగస్వామికానుంది టాటా గ్రూప్.

Tata Group Chairman Chandrasekaran met CM Chandrababu

రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై టాటా గ్రూప్ ఛైర్మనుతో చర్చ జరిగింది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ది, స్వర్ణాధ్రప్రదేశ్- విజన్ 2047 రూపకల్పన అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. 2047 నాటికి ఏపీని నెంబర్ 1 స్టేట్ చేసే లక్ష్యంతో విజన్ 2047 రూపొందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. విశాఖలో టీసీఎస్ డెవలెప్మెంట్ సెంటర్ ఏర్పాటు, ఏపీలో ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్ లైన్స్ విస్తరణ అంశాలపై టాటా గ్రూప్ చైర్మనుతో చర్చించారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో సోలార్, టెలీకమ్యునికేషన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపై టాటా గ్రూప్ చైర్మన్ తో చర్చించారు చంద్రబాబు. ఎయిర్ ఇండియా, విస్తారాతో ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపరచే అంశంపై చంద్రశేఖరన్ తో చర్చించామని తెలిపారు. వివిధ రంగాలలో అనేక ఇతర కంపెనీల భాగస్వామ్యం కల్పించే అంశం పైనా చర్చించామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version