జగన్ సర్కార్ కు బిగ్ షాక్..ఉద్యమబాట పట్టనున్న ఉపాధ్యాయులు

-

పిఆర్సి ఫిట్ మెంట్ పై ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. ఫిట్మెంట్ 27 శాతం ఇవ్వాలని, ఇంటి అద్దె బత్యం కనీసం 12 శాతానికి పైగా ఉండాలని అలాగే సిపిఎస్ రద్దు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య దశలవారీగా పోరాటాలకు పిలుపునిచ్చింది. మంత్రుల కమిటీ తో శనివారం రాత్రి జరిగిన చర్చల్లో ఫిట్మెంట్ పై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం తో చర్చల ఒప్పందాన్ని వ్యతిరేకించారు.

ఐ ఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువగా ఉండకూడదని, ఇంటి అద్దె బత్యం కనీస స్లాబ్ 12 శాతానికి ఉండాలని మంత్రుల కమిటీ ముందు ప్రతిపాదన ఉంచిన పట్టించుకోలేదని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్యమ బాట పట్టేందుకు ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి.

ఇందులో భాగంగానే సోమవారం నుంచి వారం రోజుల పాటు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకావాలని ఉపాధ్యాయులు నిర్ణయం తీసుకున్నారు. 12వ తేదీన జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం సమర్పించాలని… అలాగే 12వ తేదీన విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news