వైజాగ్ బీచ్ లో వెనక్కి వెళ్ళిన సముద్రం..!

-

సాధారణంగా కొంత మంది ప్రకృతిలో ఉన్నటువంటి అందాలను చూస్తూ.. చాలా సంతోషంగా ఆనందంగా గడిపేయాలని ఉంటుంది. ఈ తరుణంలో చాలా మంది టూరిస్ట్  ప్రదేశాలకు వెళ్లి గడుపుతుంటారు. ఇక బీచ్ లో, పార్కుల్లో గడిపేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. బీచ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే బీచ్ లో ఎగిసిపడే అలలను చూస్తుంటే.. పెద్దవాళ్లు సైతం చిన్నపిల్లల మాదిరిగా మారిపోతుంటారు. 

చాలా సరదాగా నీటిలో ఆడుతూ.. సేద తీరుతూ ఎంతో సంతోషంగా గడుపుతారు. అదే అలలు కాస్త వెనక్కి వెళ్లితే.. అక్కడే నీటి కింది భాగాన ఏం ఉంటుందో తెలుసుకోవచ్చు అనే ఉత్సాహం ఉంటుంది. సిరిగ్గా వైజాగ్ లోని ఆర్.కే. బీచ్ లో చోటు చేసుకుంది. ఒక్కసారిగా సముద్రం దాదాపుగా నాలుగు వందల మీటర్లు వెనక్కి వెళ్లింది. ఈ తీరంలో రాళ్లు బయటపడ్డాయి. బీచ్ లో సేద తీరేందుకు వచ్చిన జనం ఇది చూసి ఆశ్యర్యపోయారు. ఇక ఆపై రాళ్లు పైకి చేరి సెల్ఫీలు దిగుతూ తెగ సందడి చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version