పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయాలి – వర్ల రామయ్య

-

పెద్దిరెడ్డి కుట్ర పన్నారు కాబట్టి.. పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. పుంగనూర్‌ సంఘటనపై వర్ల రామయ్య మాట్లాడుతూ.. పులివెందుల్లోనే గొడవ పెట్టుకోవాలని చూశారు….పులివెందుల్లో చంద్రబాబు సభకు వచ్చిన జనాన్ని చూసి తోకముడిచారన్నారు. పెద్దిరెడ్డి నేతృత్వంలో అంగళ్లులో అరాచకం సృష్టించారని..పోలీసులు ప్రేకక్షుల్లా మారారని మండిపడ్డారు.

వైసీపీ నేతలను ప్రివెంటీవ్ అరెస్ట్ ఎందుకు చేయలేదని.. ఈ అరాచకానికి పెద్దిరెడ్డే ప్రధాన కారకుడు అంటూ విమర్శలు చేశారు. పెద్దిరెడ్డే స్వయంగా సారాయి పోసి చంద్రబాబు సభపై దాడులు చేయించారని ఫైర్‌ అయ్యారు. ఎస్పీ రిషాంత్ రెడ్డి వైసీపీ కార్యకర్తలాయ వ్యవహరించారని.. పెద్దిరెడ్డి కుట్ర పన్నారు కాబట్టి.. పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై డీజీపీ మీద కూడా ఫిర్యాదు చేశాం…గవర్నర్ అప్పాయింట్మెంట్ ఇస్తున్నారు కానీ.. డీజీపీ ఇవ్వడం లేదని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version