చంద్రబాబు వ్యాధికి మందు లేదు – విజయసాయిరెడ్డి సెటైర్లు

చంద్రబాబు వ్యాధికి మందు లేదని విజయసాయిరెడ్డి సెటైర్లు విసిరారు. వెన్నుపోట్లతో అడ్డదారిలో రాజకీయ శిఖరాగ్రానికి చేరి ఇప్పుడు బాధితుడిగా మారి అక్కడి నుంచి జారి పడడమే జరగబోయే పరిణామమని ఫైర్ అయ్యారు. కాలం మీ పాపాలను మరుగుపరిచినా…కర్మ వదలదు…అది వెంటాడుతూనే ఉంటుంది చంద్రబాబు! నిరాశ, నిస్పృహలు అలుముకున్న చంద్రబాబుకి పొంతన లేని మాటలు తన్నుకొస్తున్నాయ్. వాటికి తర్కం ఉండదన్నారు.

స్వీయ అపరాధాలు, అత్యాశ, ఈర్ష వల్ల కొని తెచ్చుకున్న పరిస్థితి. ఈ వ్యాధికి మందు లేదని చురకలు అంటించారు. పనీపాటా లేక సోది చెప్పించుకుంటే పాత రంకులన్నీ బైటపడ్డాయని సామెత అన్నారు విజయసాయిరెడ్డి. ఏపీని శ్రీలంక చేయాలనుకున్నది ఎవరు అన్న సెన్స్‌లో రాజ్యసభలో టీడీపీ ఎంపీ ప్రశ్నకు మంత్రి సమాధానం ‘టీడీపీనే’ అని! 1,62,828 కోట్లు బడ్జెట్‌ ఆమోదం లేకుండా వాడేసింది 2014-18లో చంద్రబాబే అని-బాబు చెప్పుతో బాబునే కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.