‘అమరావతి’ అనేది అతిపెద్ద స్కాం అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.‘అమరావతి’ అనేది అతిపెద్ద స్కామని.. షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు గారికి ముట్టిన రూ.118 కోట్లు సముద్రంలో నీటి బొట్టులాంటివంటూ చంద్రబాబుపై ఆరోపించారు. ఇందులో భాగస్వామి సింగపూర్ మంత్రి, చంద్రబాబు సన్నిహితుడు ఈశ్వరన్ అరెస్టయ్యాడు.
CRDA ప్లానింగులో అక్రమాలు, అసైన్డ్ భూముల కొనుగోళ్లు, ఇంకా లక్ష కోట్ల వ్యవహారాలు బయటకు రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్మారక నాణెం ఆవిష్కరణలో బిజెపి, టీడీపీలోని మన వాళ్లంతా ఒకటయ్యారని మండి పండ్డారు. మరో పార్టీలో ఉన్న మీ పినతల్లి నందమూరి లక్ష్మిపార్వతిని మాత్రం కలుపుకోలేక పోయారన్నారు. సంకుచిత మనస్తత్వమా? ఆమె అధికార పార్టీలో ఉందన్న అసూయా? కలివిడిగా ఉండలేనివారు రాజకీయంగా అయినా, వ్యక్తిగతంగా అయినా సంతోషంగా ఉండలేరన్నది నిజం అంటూ పోస్ట్ పెట్టారు విజయసాయిరెడ్డి.