TDP కాదు టోటల్ డ్రామాస్ పార్టీ – విజయసాయి రెడ్డి

-

TDP కాదు టోటల్ డ్రామాస్ పార్టీ అని వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి చురకలు అంటించారు. తెలంగాణ కాంగ్రెస్ ర్యాలీల్లో పచ్చ కండువాలు స్వైర విహారం చేస్తున్నాయంటే టోటల్ డ్రామాస్ పార్టీ (TDP) ఎటువంటి అపవిత్ర పొత్తులకైనా తెగించిందని అర్థం అని ట్వీట్ చేశారు వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి.

వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి

ఇంగ్లిష్ మీడియం వల్ల ప్రయోజనం లేదని సిపిఎం రాఘవులు గారు అన్నారంటే తోక పార్టీల్లోనూ కుల, పెత్తందారీ అహంకారం ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. అటు పురందేశ్వరిని కూడా టార్గెట్ చేశారు వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి. చెల్లెమ్మా పురందేశ్వరి! జిల్లాకు మీ నాన్న పేరు పెట్టిన జగన్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకొని…మీ నాన్నను వెన్నుపోటు పొడిచిన మీ మరిదికి శిక్ష పడకుండా మీరు చేస్తున్న పనిని ఏమంటారో దయచేసి చెప్పగలరా? అని ఫైర్ అయ్యారు. భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడా? అని నిలదీశారు వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version