మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా అంశంపై వైఎస్సార్ సీపీ రాజ్యసభ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి స్పందించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడారు అయోధ్య రామిరెడ్డి. వ్యక్తిగత కారణాల వల్లనే రాజీనామా చేశారని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలిపారు. ఆర్.కే. ఎమ్మెల్యే గా మంచి పనులు చేశాడు. ఆయన పార్టీలోనే ఉంటారు. నాకు అర్థం అయింది ఏంటంటే..? ఆర్.కే.గారిని సాక్రిప్రైజ్ చేసుకున్నారు. సీఎం జగన్ కి మంచి ఆర్.కే.సన్నిహితులు.
రాజకీయ సమీకరణాల వల్లనే ఆయనకు మంత్రి పదవీ ఇవ్వలేకపోయామని తెలిపారు. ఆర్.కే. ఒక బ్రాండ్ అని తెలిపారు. అయితే ఎమ్మెల్యే ఆర్.కే.కి అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అవి రీచ్ అవ్వలేకనే రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకున్నారు. అన్నీ ఆలోచించుకునే ఆయన రాజీనామా చేసి ఉంటారని రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. మంగళగిరి ఇన్ చార్జీగా గంజి చిరంజీవిని వైసీపీ అధిష్టానం ప్రకటించింది. 2024లో అద్భుతమైన మెజార్టీతో విజయం సాధించబోతుందని అయోధ్య రామిరెడ్డి స్పష్టం చేశారు. మంగళగిరిలో మళ్లీ వైసీపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.