కేంద్ర మంత్రివర్గంలోకి వైసిపి ? అదే జరిగితే ?

-

, వైసిపి ఏ మాత్రం తగ్గకుండా, కేంద్రం ప్రవేశపెట్టే అన్ని బిల్లులకు మద్దతు తెలపడం, కొన్ని కొన్ని వివాదాస్పద బిల్లుల విషయంలో  ఏపీలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది అని తెలిసినా, పట్టించుకోకుండా, మద్దతు ఇస్తూనే వస్తున్నారు. విద్యుత్ సంస్కరణల బిల్లు, వ్యవసాయ బిల్లు ప్రవేశపెట్టడంపై దేశ వ్యాప్తంగా కేంద్రం తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. కొన్ని పార్టీలు బీజేపికి దూరమయ్యాయి. ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. అయినా ఆ సమయంలో వైసీపీ బీజేపీ కి అండగా నిలవడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది.
ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం ఏపీ సీఎం జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఎన్డీఏ లో చేరవలసిందిగా అమిత్ షా జగన్ కు ఆఫర్ ఇచ్చినట్లు, అలా చేరితే, రెండు మూడు కేంద్ర మంత్రి పదవులు వైసిపి ఇచ్చేందుకు ఆయన అంగీకారం తెలిపినట్లు వార్తలు వచ్చాయి. ఒకవేళ కేంద్ర మంత్రివర్గంలో వైసీపీ చేరితే ఏపీలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే నిధుల కొరతతో తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వానికి కేంద్రం మరింతగా సహకరించే అవకాశం ఉంటుంది. అలాగే ఏపీకి సంబంధించిన అనేక పెండింగ్ బిల్లులు పరిష్కారం, కీలకమైన ప్రాజెక్టులకు సంబంధించిన వ్యవహారాలు, ఏపీ కి సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలకు కేంద్రం సహకారం లభించడం ఇవన్నీ జరుగుతాయి.
అలాగే ఏపీ బీజేపీ నాయకులు ఇప్పటివరకు టార్గెట్ చేసుకుంటూ వచ్చినా, ఇకపై జగన్ కు మద్దతుగా నిలబడటమే కాకుండా, ఈ రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా తెలుగుదేశం పార్టీ ని దెబ్బతీసే కార్యక్రమానికి పదును పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే వైసీపీకి రాజకీయ పరంగా ఉన్న అడ్డంకులను పరిష్కరించుకునేందుకు కేంద్రం అన్ని రకాలుగానూ సహకరిస్తుంది. ముఖ్యంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ నుంచి వచ్చే విమర్శలకు బ్రేక్ పడుతుంది. నిధుల సమస్యను అధిగమించడం తో పాటు, జగన్ ప్రవేశపెట్టిన భారీ సంక్షేమ పథకాలను అధికారులు ఉన్నన్నాళ్ళు నిరాటంకంగా అమలు చేసే అవకాశం ఉంటుంది.మరి జగన్ నిర్ణయం ఏ విధంగా ఉంటుందో ?
-Surya

Read more RELATED
Recommended to you

Latest news