విశాఖ;- తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత షాకింగ్ కామెంట్స్ చేసారు…జగన్ రెడ్డి చేతకాని పాలన వల్ల రాష్ట్రంలో మహిళ భద్రత కు విఘాతం ఏర్పడిందని…ఒక వికలాంగురాలి ని 30 గంటల పాటు హత్యాచారం చేస్తే..పోలీసు స్పందించలేదని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి వచ్చిన ప్రతిపక్ష నేతకు నోటీసులు ఇస్తారా….? అని ప్రశ్నించారు.వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ చైర్మన్ అనుకుంటున్నారా..? ఇంకా వైసిపి అధికార ప్రతినిధి అనుకుంటున్నారా…? అని ఆగ్రహించారు.సజ్జల డైరెక్టన్ లో వాసిరెడ్డి పద్మ నటిస్తున్నారు.
గుంటూరు లో ఒక మహిళను పొడిచి చంపితే ఈ రోజుకి కూడా చర్య లేదన్నారు. ఒక్క ఆడ బిడ్డకు న్యాయం చేసాను అని చెప్పుకుని ఆ పదవి లో కూర్చోండి… కనీసం చంద్రబాబు కు నోటిసు ఇచ్చేటప్పుడు డేట్స్ కూడా సరిగ్గా చూడకుండా నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు.
మహిళల శారీరక వేధింపులలో దేశంలో రెండో స్థానం లో ఆంధ్ర ప్రదేశ్ ఉంటే వాసిరెడ్డి పద్మ.. సీఎం కు నోటీసు ఇస్తారా…? అని ప్రశ్నించారు. దిశ చట్టం ఉందని ప్రలోభ పెట్టిన సీఎం కు ముందు నోటీస్ లు ఇవ్వండన్నారు.