నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్..టెన్త్ అర్హత తో రైల్వేలో ఉద్యోగాలు..

-

నిరుద్యోగులకు ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను అందిస్తూ వస్తుంది. ప్రభుత్వ శాఖ లలో గల ఖాళీలకు సంభందించిన నోటిఫికేషన్ ను విడుదల చేస్తూ కొత్త వారికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు. తాజాగా మరో నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది..భారత రైల్వేలో టెన్త్ అర్హతతో ఉన్న ఉద్యొగాలకు సంభంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది..ఆ ఉద్యోగాల గురించి పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…

ఈశాన్య సరిహద్దు రైల్వే నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 5636 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ nfr.indianrailways.gov.in వెబ్ సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల: మే 30, 22.

అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం: జూన్ 1 ఉదయం 11 గంటల నుంచి..

దరఖాస్తు ప్రక్రియ ఆఖరి తేదీ: జూన్ 30, రాత్రి 10 గంటల వరకు..

విద్యార్హతల వివరాలు:

-అభ్యర్థులు టెన్త్ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు పొంది ఉండాలి.

-అభ్యర్థులు ఐటీఐ సర్టిఫికేట్ ను కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్లు ఉండాలి.

ఎలా అప్లై చేయాలంటే..

అభ్యర్థులు మొదట nfr.indianrailways.gov.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.

అనంతరం ‘NFR recruitment 2022’ లింక్ పై క్లిక్ చేయాలి.

అనంతరం అప్లికేషన్ ఫామ్ లో కావాల్సిన వివరాలను నమోదు చేసి.. సూచించిన డాక్యుమెంట్లను నమోదు చేయాల్సి ఉంటుంది.

అప్లికేషన్ ఫామ్ లో నమోదు చేసి వివరాలను ఓ సారి చెక్ చేసి సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.

అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి…

ఈ ఉద్యోగాల పై ఆసక్తి కలిగిన వాళ్ళు నోటిఫికేషన్ ను వెబ్‌సైట్‌ లోని పూర్తీ సమాచారాన్ని తెలుసుకొని అప్లై చేసుకొవాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version