“గాడ్ ఫాదర్” నుంచి మరో మాస్ సాంగ్ రిలీజ్.. మెగా ఫ్యాన్స్ కు జాతరే

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ” గాడ్ ఫాదర్”. “లూసిఫర్” కి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో చిరు రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే తెలుగులో డబ్ అయినప్పటికీ పలు మార్పులు చేసి.. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రేక్షకులకు మళ్లీ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ లుక్, టీజర్, “తార్ మార్ తక్కర్ మార్” అంటూ సాగే పాట మూవీని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లారు.

నేడు సెకండ్ సింగిల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ” నజబజ” అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో నయనతార ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సత్యదేవ్, సునీల్, సముద్రఖని, కీలక పాత్రలలో నటించనున్నారు. కొణిదల సురేఖ సమర్పణలో కొణిదల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై ఆర్బీ చౌదరి, ఎన్ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా కానుకగా అక్టోబర్ 5 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version