‘యూ’ అంటూ..నజ్రియాకు థమ్సప్ సింబల్ చూపిస్తున్న నాని..‘అంటే సుందరానికీ’ ఏమైంది?

-

నేచురల్ స్టార్ నాని నటించిన 28వ చిత్రం ‘అంటే సుందరానికీ’. ఈ నెల 10న విడుదల కానున్న సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా మలయాళం క్యూట్ బ్యూటీ నజ్రియా ఫహద్ ఫాజిల్ తెలుగులో పరిచయం అవుతున్నారు. వివేక్ సాగర్ అందించిన సంగీతం ఆకట్టుకుంటోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ హిలేరియస్ గా ఉంది.

ఇక ఈ చిత్రంలో నవ్వులు పూయించడమే టార్గెట్ గా దర్శకుడు పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చక్కగా ఈ చిత్రాన్ని చూసేయొచ్చని మేకర్స్ చెప్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version