శ్రీకాకుళం జిల్లా, సోంపేట టౌన్లో నిన్నటి వేళ ఇచ్ఛాపురం నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఇది వైసీపీకి సంబంధించి ఇంటర్నల్ మీటింగ్. ఇదే జిల్లాకు చెందిన టెక్కలి నియోజకవర్గ స్థాయి సమావేశం ఇక్కడినియోజకవర్గ కేంద్రంలో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ రెండు మీటింగ్ లకూ విద్యాశాఖ మంత్రి బొత్స అతిథిగా హాజరయ్యారు. అధినేత మాటలనూ, తన మాటలనూ కలిపి చెప్పారు. కానీ ఇక్కడ ఆ మాటలు వర్కౌట్ అయ్యేయా ! లేదా అవుతాయా ? ఎందుకంటే ప్రతి చోటా ఆశావహులు ఉన్న విధంగానే ఇక్కడ కూడా పదుల సంఖ్యలో ఆశావాదులు ఉన్నారు.ఆ ఆశావాది తంత్రాన్ని అర్థం చేసుకుని జగన్ పనిచేయగలరా?
జగన్ కు శ్రీకాకుళం సెంటిమెంట్ ఉంది అని అంటారు. అంటే ఆయన ఏ పనిచేసినా ఇక్కడి నుంచి మొదలుపెడ్తారు అని.. ! ఆ విధంగా చూసుకుంటే నిన్నటి వేళ నియోజకవర్గ స్థాయి సమావేశాలకు కూడా ఇక్కడి నుంచే శ్రీకారం దిద్దారు బొత్స..అధినేత బాటలో ! ఇవన్నీ బాగున్నాయి కానీ ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి కన్నా కార్యకర్తల్లో నెలకొన్న అసంతృప్తి కన్నా నాయకుల్లో నెలకొన్న లేదా గూడు కట్టుకున్న అసంతృప్తే ఎక్కువగా ఉంది. దీంతో బొత్సకు వర్గ విభేదాలను తగ్గించడం సాధ్యం కానీ పని.
ఇక తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ ఇలానే ఉంది. అంటే ప్రస్తుతానికి ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రాజీకివచ్చినా ఇక్కడ కూడా అసంతృప్త వాదం బలీయంగా ఉంది. అయితే ఈ అసంతృప్తి టీడీపీ తనకు అనుగుణంగా మలుచుకునే పనిలో ఉంది. ఎలానూ ఎమ్మెల్సీ అనంత బాబు వివాదం ఉంది కనుక దీనిని కూడా తమకు అనుగుణంగా మార్చుకునే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఈ మేరకు టీడీపీ కొంత సఫలీకృతం అయింది కూడా ! ఇక ఈ వివాదంఒతో పాటు ప్రజా సమస్యలపై పోరు చేస్తే ఫలితాలు ఉంటాయి. అయితే ఇక్కడ కూడా జగన్ కోచింగ్ సెంటర్ పెద్దగా ప్రభావం చూపడం లేదు.
ఉత్తరాంధ్రతో సహా ఆ రెండు గోదావరి జిల్లాలను కలుపుకుని ఐదు జిల్లాలలో ఉన్న కో ఆర్డినేటర్లు మనసు ఉంచి పనిచేయడం లేదు అన్న వాదన ఉంది. ఇక కొత్త జిల్లాల ఏర్పాటు అన్నది ప్రజలకే కాదు నాయకులకు కూడా ఇష్టం లేని పని. ఈ పని చేసిన కారణంగా జగన్ కొంత అప్రతిష్ట పాలయ్యారు. సాధ్యమైనంత త్వరగా జగన్ పాలన దిద్దితే, ఆయన నిర్వహిస్తున్న పొలిటికల్ కోచింగ్ సెంటర్ ఫలితాలు బాగుంటాయి.