చంద్రబాబు ఓ ముసలి సీఎం అంటూ ఏపీ సీఎం జగన్ హాట్ కామెంట్స్ చేశారు. కాసేపటి క్రితమే పల్నాడు జిల్లా వినుకొండకు సీఎం జగన్ చేరుకున్నాడు. ఈ సందర్భంగా జగనన్న చేదోడు పథకం మూడో విడత సాయం అందజేశారు.
అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ, వెన్నుపోటు దారులకు, మీ బిడ్డ జగన్ కు మధ్య యుద్దం జరుగుతుంది.. మీ బిడ్డ కు పొత్తులు ఉండవు…ఒంటరిగా సింహం లా పోరాడతాడని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తోడేళ్లంతా ఒక్కటవుతున్నాయి.. గత పాలనలో ఓ గజదొంగల ముఠా ఉండేదని ఫైర్ అయ్యారు.
దోచుకో పంచుకో, తినుకో అనేదే వీరి పాలసీ.. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు ప్రశ్నించడని ఆగ్రహించారు. గతంలో ఒక ముసలాయన ముఖ్యమంత్రిని చూశాం.. గతంలో ఎందుకు ఇలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వలేదని ఓ రేంజ్ లోఫైర్ అయ్యారు సీఎం జగన్. వైసీపీ పాలనలోనే ఎందుకు జరుగుతోందో ఆలోచన చేయండని ఏపీ ప్రజలను కోరారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.