కేసీఆర్‌ ప్రభుత్వంపై సుప్రీం కోర్టులో జగన్‌ పిటీషన్‌ !

-

తెలుగు అకాడమీ విభజన పై మరోసారి ఏపీ ప్రభుత్వం సుప్రీమ్ కోర్టును ఆశ్రయించింది. విభజన లో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ…సుప్రీం కోర్టు మెట్లు ఎక్కింది ఏపీ సర్కార్‌. సుప్రీమ్ కోర్ట్ తీర్పును తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపణ చేసింది ప్రభుత్వం… రెండు వారాల్లో (నెలాఖరు వరకు) నిధులు ఉద్యోగుల విభజన పూర్తి చేయాలనీ గతేడాది సెప్టెంబర్ 14 న తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీం కోర్టు.

అయితే..సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేసే క్రమంలో బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ల ను విత్డ్రా చేయడానికి తెలంగాణ తెలుగు అకాడమీ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే… రూ. 65 కోట్ల నిధుల గల్లంతు వ్యవహారం వెలుగు చూసింది. దీంతో విభజన ప్రక్రియ నిలిచిపోయింది. కోర్టు ఆదేశాలిచ్చి ఆరునెలలు కావొస్తున్నా పట్టించుకోకపోవడంపై తెలంగాణ ప్రభుత్వంపై ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే..దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news