మూడు రాజధానులపై ఏపీ హై కోర్టు కీలక తీర్పు !

-

అమరావతి : మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై ఇవాళ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే ప్రభుత్వ, పిటిషన్ దారుల వాదనలు పూర్తి కాగా.. ఫిబ్రవరి నాలుగో తేదీన తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు ధర్మాసనం. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇవాళ తీర్పు ఇవ్వనుంది. సుమారు 70 పిటిషన్లపై తీర్పు ఇవ్వనుంది హైకోర్టు ధర్మాసనం.

విచారణ జరుగుతుండగానే మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ రద్దు చట్టాలను వెనక్కు తీసుకుంది ప్రభుత్వం. మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసుకున్నప్పటికీ తాము దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కొన్ని అభ్యర్థనలు మిగిలే ఉన్నాయని, వాటిపై విచారణ జరిపి తగిన ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు. హైకోర్టు తీర్పు అనంతరం రాజధానుల ఏర్పాటుపై న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా కొత్త బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇక ఇవాళ వెలువడే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news