BRSపై పార్టీపై ఏపీ మంత్రి బొత్స కామెంట్స్‌

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన జాతీయ పార్టీపై ఆంధ్ర ప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చుకోవడం వాళ్ల ఇష్టమని అన్నారు. ఏపీలో ఉన్న పార్టీల్లో బీఆర్ఎస్ ఒకటి అవుతుందని తెలిపారు. ఎంతమంది పోటీలో ఉంటే అంత మంచిదని అన్నారు. తమ పార్టీపై బీఆర్ఎస్ ప్రభావం ఏం ఉండదని చెప్పారు.

ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ తన సత్తా చాటినా.. ఏపీలో మాత్రం ఈ పార్టీ నిలదొక్కుకోవడం కాస్త కష్టమేనని రాజకీయ నిపుణులు అంటున్నారు. బీఆర్ఎస్ కు అసలైన సవాల్ ఏపీలోనే ఎదురవుతుందని చెబుతున్నారు. గత చరిత్రతో పాటు ప్రస్తుత సమస్యలు కేసీఆర్‌ను వెంటాడతాయని.. ఆయన వాటిని చాకచక్యంగా ఎదుర్కొంటే తప్ప ఏపీలో ఆ పార్టీ నిలబడదని అన్నారు.

మరోవైపు .. టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మారుస్తూ.. తెలంగాణ భవన్​లో పార్టీ చేసిన తీర్మానం కాపీని తీసుకొని తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ నేతృత్వంలోని బృందం దిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. టీఆర్​ఎస్​ను భారత్ రాష్ట్ర సమితి-బీఆర్​ఎస్​గా మారుస్తూ చేసిన తీర్మానం కాపీని ఈసీ అధికారులకు అందజేశారు. పేరు మార్పుకు ఆమోదం తెలపాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news