BREAKING : రేపు ఉదయం 9.05 గంటలకు ఏపీ కొత్త జిల్లాల ప్రారంభం

-

రేపు ఉదయం 9.05 నిమిషాల నుంచి 9.45 నిమిషాల మధ్య కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభిస్తారని ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ పేర్కొన్నారు. మంటేడ మండలాన్ని పార్వతీపురం నుంచి విజయనగరం జిల్లాలోకి మార్చామని.. పెందుర్తి నియోజకవర్గంలోని పెందుర్తి మండలాన్ని విశాఖలో ఉంచామని వెల్లడించారు.

మిగిలిన నియోజకవర్గం అనకాపల్లి జిల్లాలో కొనసాగుతుందని.. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో మండలాల మార్పు చేశామన్నారు. మొత్తం మీద 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండు జిల్లాల్లో ప్రాతినిధ్యం లభించినట్లు అయ్యిందని.. సాలూరు, పెందుర్తి, జగ్గంపేట, అనపర్తి, ముమ్మిడివరం, రామచంద్రాపురం, గోపాలపురం, వెంకటగిరి, నగరి, రాజంపేట, పాణ్యం, రాప్తాడు.. పశ్చిమ గోదావరి జిల్లాలో ద్వారకా తిరుమలను ఏలూరులో ఉంచాలన్న డిమాండ్ కు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.

శ్రీకాకుళం జిల్లాలో ఒక ఐటీడీఏ కొత్తగా ఏర్పడిందని.. 42 ఏళ్ళ తర్వాత జిల్లాల విభజన జరిగిందన్నారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో జిల్లాల విభజన జరుగలేదని.. ఒక రెవెన్యూ డివిజన్‌కు సగటున 9 మండలాలు ఉండేటట్లు చూశామని.. స్పష్టం చేశారు. కుప్పం రెవెన్యూ డివిజన్‌ను ప్రత్యేకంగా పరిగణించి కుప్పం,విజయవాడ, విశాఖపట్నం స్పెషల్ కేసుగా చూశామని వివరించారు. విశాఖలో ఆరు నియోజకవర్గాలు ఉన్నా మొత్తం మీద 11 మండలాలే ఉన్నాయని… అర్బన్ ప్రాంతాల్లో ఈ స్టేల్ అప్లై చేయలేమని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version