బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే సగ్గుబియ్యం చేర్చేయండి మెనూలోకి.!

-

సగ్గుబియ్యంతో సేమ్యాపాయసం చేసుకుంటారు కానీ.. దాంతో ఇంకా చాలా వెరైటీలు చేసుకోవచ్చు. వీటితో చేసే టిఫెన్స్‌ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది తెలుసు..ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు.. సగ్గుబియ్యాని విపరీతంగా వాడేయోచ్చు. ఇది ప్రయత్నానికి మరింత హెల్ప్‌ అవుతుంది. సగ్గుబియ్యంతో ఏం చేసినా రుచిగానే ఉంటాయి. కడపునిండా తింటూనే బరువు తగ్గడం అంటే ఇదే కదా.! సగ్గుబియ్యంలో ప్రొటీన్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీనితో పాటు క్యాలరీల పరిమాణం కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో సగ్గుబియ్యం బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది.

బరువు తగ్గేటప్పుడు చాలా మంది కడుపు సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అటువంటి పరిస్థితిలో సగ్గు బియ్యాన్ని తీసుకుంటే మలబద్ధకం సమస్య దూరమవుతుంది. దీని కోసం సగ్గు బియ్యం గంజి, లేదా ఖిచిడిని చేసుకొని తినవచ్చు. అదే సమయంలో ఇందులో ఉండే ఫైబర్ కడుపు సమస్యలను తగ్గిస్తుంది.

సగ్గుబియ్యం తినడం ద్వారా పదే పదే ఆహారం తినాలనే కోరిక ఉండదు. ఎందుకంటే సగ్గుబియ్యం రోజంతా శక్తితో నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇందులో ఉండే క్యాలరీలు మీ పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతాయి. దీని వల్ల బయటి వస్తువులను తినకుండా నియంత్రించుకోగలుగుతారు. ఇంకా ఊబకాయం కూడా తగ్గుతుంది.

సగ్గుబియ్యం ఖిచిడీని తీసుకోవడం మధుమేహ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం, ఐరన్ షుగర్ లెవెల్‌ను అదుపులో ఉంచుతాయి.

బరువు తగ్గాలనుకే వారు ప్రోటీన్‌ ఉన్న ఆహారం తినడం తగ్గిస్తారు. ఇది మన బరువును తగ్గిస్తుంది. కానీ ఇది లోపల నుంచి మనల్ని బలహీనంగా చేస్తుంది. అటువంటి పరిస్థితిలో ఆహారంలో సగ్గు బియ్యం (సాబుదానా) ను చేర్చుకుంటే.. హెల్తీగా బరువు తగ్గొచ్చు.

సగ్గుబియ్యంతో సింపుల్‌గా కిచిడీ చేసుకోవచ్చు..పదినిమిషాల్లో రెడీ అవువుతుంది. సగ్గుబియ్యాన్ని టిఫెన్‌, లంచ్‌, డిన్నర్‌ ఇలా ఎప్పుడైనా తీసుకోవచ్చు. మీకు ఏమాత్రం విసుగురాదు. షుగర్‌ రోగులకు మరీ మంచిది కాబట్టి.. ఇడ్లీలు, దోశలనే డైలీ తినకుండా అప్పుడప్పుడు ఇది కూడా తీసుకుంటే మంచిదనంటున్నారు నిపుణలు.

Read more RELATED
Recommended to you

Latest news