చాలా మంది టాయిలెట్లలో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు. మీరు కూడా టాయిలెట్లు లో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారా…? అయితే ఈ సమస్యలన్నిటినీ కొని తెచ్చుకున్నట్లే. చాలా మందికి ఈ సమస్య ఉంటుంది. ఎక్కువగా టాయిలెట్ లో సమయాన్ని గడుపుతూ ఉంటారు. కానీ పది నిమిషాలు దాటి టాయిలెట్లో ఉండటం వలన రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఆ సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పైల్స్ సమస్య:
ఎక్కువసేపు టాయిలెట్లలో కూర్చోవడం వలన పైల్స్ సమస్య వచ్చే అవకాశం ఉంది. రెక్టమ్ మీద ఒత్తిడిని పెట్టగలదు. అలానే వాపు వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా ఎక్కువ సేపు కూర్చుని కూర్చుని పైల్స్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్:
ఎక్కువసేపు టాయిలెట్లో కూర్చోవడం వలన యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వంటివి కలిగే అవకాశం ఉంది. ఎక్కువసేపు కూర్చోవడం వలన యూరత్రాలో బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్ కి దారితీస్తుంది. ఈ సమస్య బారిన పడకుండా ఉండాలంటే టాయిలెట్లో ఎక్కువసేపు కూర్చోవడం తగ్గించాలి. అలానే శుభ్రతను కూడా తప్పక పాటించాలి. ఎక్కువగా ఫ్లూయిడ్స్ ని తీసుకుంటూ ఉంటే బ్యాక్టీరియాని బయటికి పంపించవచ్చు.
నీరు వృధా:
ఎక్కువగా టాయిలెట్ లో సమయాన్ని గడపడం వలన మీరు నీటిని వృధా చేస్తూ ఉంటారు అవసరమయ్యే దానికంటే ఎక్కువ నీళ్లను మీరు వాడతారు.
డైలీ రొటీన్ మీద ఎఫెక్ట్:
ఎక్కువ టాయిలెట్ లో కూర్చోవడం వలన మీ డైలీ రొటీన్ కూడా దెబ్బతింటుంది. 10 నిమిషాలు దాటి టాయిలెట్లో మీరు ఉంటే డైలీ యాక్టివిటీస్ దెబ్బతింటాయి. ఇది చాలా ప్రమాదకరం కూడా.
ఈ సమస్యలూ వున్నట్టే:
టాయిలెట్లో పది నిమిషాలు దాటి సమయాన్ని వెచ్చిస్తే ఐబీఎస్ వంటి సమస్యలు ఉన్నట్లు ఐబీఎస్, పర్సిస్టెంట్ డయేరియా, కాన్స్టిపేషన్ వలన చాలామంది ఎక్కువ సేపు టాయిలెట్లు లో కూర్చుంటారు.
చివరగా..
తీసుకునే ఆహరం బాగా జీర్ణం అయ్యేలా చూసుకోవాలి మీ సమస్యని పరిష్కరించుకోండి కానీ పది నిమిషాలు దాటి టాయిలెట్ లో కూర్చోవడం వలన రకరకాల సమస్యలని కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. టాయిలెట్ లో ఫోన్ ని వద్దు.