దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. దీని వలన కస్టమర్స్ కి ఎన్నో ప్రయోజనాలు అందుతున్నాయి. ఇదిలా ఉండగా బ్యాంక్ ఇచ్చిన సమాచారం ప్రకారం కస్టమర్స్ OTP లేకుండా నగదు తీసుకోలేరు అని తెలుస్తోంది. మరి ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. ఏటీఎంస్ లో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకోసమే స్టేట్ బ్యాంక్ ఓ రూల్ ని తీసుకు రావడం జరిగింది.
ఎవరైనా సరే నగదు ఉపసంహరణ సమయంలో ఓటీపీ ని ఎంటర్ చెయ్యాలని అప్పుడే ATM నుండి డబ్బులు వస్తాయి. రూ. 10,000 అంతకంటే ఎక్కువ విత్‌డ్రా చేయడంపై ఈ రూల్ ని తీసుకొచ్చారు. బ్యాంక్ ఖాతా, డెబిట్ కార్డ్ పిన్ నుండి వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన OTP ద్వారా రూ. 10,000, అంతకంటే ఎక్కువ విత్‌డ్రా చేసుకోవడానికి బ్యాంక్ పెర్మిషన్ ని ఇస్తుందట.
ఆ ఓటీపీ ని ఎంటర్ చేసాకనే డబ్బులని తీసుకునేందుకు కుదురుతుంది. ఇలా ఈ రూల్ వలన మోసాలు ఏమి జరగకుండా మనం చూడచ్చు. ఇటీవలే మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కనుక వాటిని ఆపేందుకు ఇది అవసరం. మొసలి ఆపేందుకు ఈ రూల్ హెల్ప్ అవుతుంది అని స్టేట్ బ్యాంక్ దీన్ని ప్రవేశ పెట్టింది.