మహిళల ‘నెలసరి’పై బీజేపీ ఎమ్మెల్యేల వివాదాస్పద వ్యాఖ్యలు

-

కొంతమంది ప్రజాప్రతినిధులు ఎప్పుడూ ఏదో ఓ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో వ్యక్తులుగా నిలుస్తుంటారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇలా పార్టీతో సంబంధం లేకుండా గతంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొంత మంది రోడ్లను కత్రినా కైఫ్, హేమామాలిని బుగ్గలు, గ్లామర్ తో పోలుస్తూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక మరికొంత మంది మహిళల వస్త్రధారణ, మానభంగాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలా వ్యాఖ్యానించడం చాలా చర్చకు దారి తీశాయి. ప్రజలు, మహిళల నుంచి తీవ్ర వ్యతిరేఖత కూడా వ్యక్తం అయింది. 

ఇదిలా ఉంటే తాజాగా అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ ఎంపీలు మహిళల ‘ నెలసరి’ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలకు నెలసరి సెలవులను ఇవ్వడాన్ని  తీవ్రంగా వ్యతిరేఖించారు. రుతుక్రమాన్ని ‘ డర్టీ థింగ్’ అంటూ వ్యాఖ్యానించారు. నెలసరి సెలవులు కల్పించాలంటూ.. కాంగ్రెస్ సభ్యుడు అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు ఈవ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మహిళలు, మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version