మోదీ ఈగో సంతృప్తి కోసమే వ్యవసాయ చట్టాలు ఏర్పడ్డాయి— ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ..

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాదిగా ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతన్న రైతుల నిరసన, ధర్నాలకు ఫలితంగా వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకుంది. తాజాగా వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయంపై దేశంలోని ప్రముఖ రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు, సెలబ్రెటీలు స్పందిస్తున్నారు.

తాజాగా ఎంఐఎం ఛీప్ అసదుద్దీన్ ఓవైసీ మూడు వ్యవసాయ చట్టాల రద్దుపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. గతంలో కూడా అసదుద్దీన్ ఓవైసీ వ్యవసాయ చట్టాలను వ్యతిరేఖిస్తూ వస్తున్నారు. ’ మోదీ తన అహాన్ని పక్కన పెట్టి, రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించినట్లయితే ఈ నల్ల చట్టాలు వచ్చేవి కాదని అసద్ అన్నారు. ఇంత మంది రైతుల చనిపోవాల్సిన అవసరం వచ్చేదే కాదని.. ఇది ఆలస్యంగా తీసుకున్న నిర్ణయమని అన్నారు. ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపితే ప్రభుత్వాలు భయపడుతాయని నేనేపుడు అంటుంటానని అసదుద్దీన్ అన్నారు. ఇది రైతులందరి విజయమని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు.. రాజ్యాంగ వ్యతిరేఖమైనవని, ఇలాంటి చట్టాలు చేసే రాజ్యాంగ హక్కు మోదీ ప్రభుత్వానికి లేదన్నారు. మోదీ అహం సంతృప్తి కోసమే ఈ చట్టాలు ఏర్పడ్డాయి. ఈ నల్ల చట్టాల వల్ల 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని‘ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.