Yoga Day 2023 : ఈ ఆసనాలతో బెల్లీ ఫ్యాట్ మాయం..!

-

చాలా మంది బెల్లీ ఫ్యాట్ తో బాధ పడుతూ ఉంటారు. మీరు కూడా వెళ్లి ఫ్యాట్ తో బాధ పడుతున్నారా..? బెల్లీ ఫ్యాట్ సమస్య నుండి బయట పడాలనుకుంటున్నారా..? అయితే ఈ ఆసనాలని రోజు వేస్తే సరిపోతుంది. ఈ ఆసనాల తో బెల్లీ ఫ్యాట్ కి చెక్ పెట్టచ్చు మరి ఇక ఈ ఆసనాల గురించి చూసేద్దాం.. ధనురాసనం తో ఈజీగా బెల్లీ ఫ్యాట్ నుండి బయట పడచ్చు. చూడ్డానికి విల్లులా ఇది కనపడుతుంది. ఈ ఆసనం బెల్లీ ఫ్యాట్‌ని త్వరగానే తగ్గిస్తుంది. పైగా ఈ ఆసనాన్ని వేస్తె పొత్తి కడుపు కండరాలు బలంగా మారతాయి. వెన్నెముకని కూడా బలంగా ఉంచవచ్చు.

ఈ ఆసనాన్ని వేస్తె ఒత్తిడి, ఆందోళన కూడా వుండవు. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ నుండి బయట పడచ్చు. ఉష్ట్రాసనాన్ని వేసి కూడా ఈ సమస్య నుండి బయట పడచ్చు. దీన్నే క్యామెల్ పోజ్ అని కూడా అంటారు. వెన్ను, వెన్నెముక సమస్యలతో బాధ పడే వారు వేస్తె ఉపశమనం ఉంటుంది. బెల్లీ ఫ్యాట్‌ని చక్కగా ఈజీ గా ఈ ఆసనం తో తగ్గించేయచ్చు.

అలానే కుంభకాసనాన్ని వేస్తె కూడా మంచిది. దీన్నే ప్లాంక్ పోజ్ అంటారు. రెగ్యులర్‌గా ఈ ఆసనం వేస్తె బరువు తగ్గచ్చు. అలానే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. వెన్నునొప్పి కూడా తగ్గుతుంది. కోర్ కండరాలను బలంగా చేసి మీ బాడీ బ్యాలెన్స్‌, ఫ్లెక్సీబిలిటీని ఇది పెంచుతుంది. అలానే కోబ్రా స్ట్రెచ్ కూడా చెయ్యచ్చు. దీన్నే భుజంగాసనం అంటారు. ఇది చేయడం వల్ల అదనపు బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version