తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల నుంచి పాలక పక్షానికి విమర్శలు, నిరసనలు ఎదురవుతున్నాయి. తెలంగాణ 2022-23 బడ్జెట్ ను ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. బడ్జెట్ సమావేశాలకు ముందు గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం లేకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అని వారు ఆరోపించారు.
అంతకు ముందు బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. హరీష్ రావు ప్రసంగిస్తూ.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీనికి ప్రతిగా.. బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. సభలో బీజేపీ ముగ్గురు ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ లను సస్పెన్షన్ తీర్మాణాన్ని ప్రవేశపెట్టగా… సభ ఆమోదించింది. దీంతో సభ్యులు అసెంబ్లీ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఆ తరువాత పోలీసులు వారిని బొల్లారం పీఎస్ కు తరలించారు.