మరోసారి వైసీపీ సర్కార్‌పై విమర్శలు చేశారు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదన్నట్లు సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏపీని అన్ని విధాలుగా అధోగతి పాలు చేసిన వైసీపీ ప్రభుత్వంపై.. ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని స్పష్టం చేశారు అచ్చెన్నాయుడు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు. తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు అన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు కృషి చేయాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. మొదటి శాసనసభలో జగన్మోహన్ రెడ్డి స్పీచ్ విన్నాను..
ఎంటి వీళ్లు 151 సీట్లు గెలిచారు. వీళ్ల స్పీచ్ చూస్తే ఎవరు ఇంతవరకు మాట్లాడలేదు.. మన పార్టీ భవిష్యత్తు ఎంటని భయపడ్డాను.. అంతనీతి మాటలు మాట్లాడారు.. కానీ మాటలకి చేతలకి పొంతన లేదు.. అబద్దానికి ప్యాంటు, షర్టు వేస్తే ఎమిటో జగన్మోహన్ రెడ్డి అబద్దాలకి ఒక కేర్ ఆఫ్ అడ్రాస్.. మూడున్నర సంవత్సరాలు అభివృద్ధి చేసి, సంక్షేమాలు ఇచ్చి, పార్టీ బలపడాలంటే అది మంచి విధానం.. కానీ కక్ష గట్టి.. తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు పెట్టి అసలు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీయే ఉండకూడదు.. మిగిలినటువంటి రాజకీయ పార్టీనే ఉండకూడదు.. ఒకే ఒక పార్టీ వైసీపీ పార్టీనే ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టు ప్రారంభించారు.’ అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.