ఏపీ వ్యాప్తంగా సినిమా థియేటర్లపై దాడులు చేస్తున్నారు అధికారులు. వివిధ రకాల అనుమతుల పేర్లతో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. చిన్న లోపాలకు సైతం జరిమానాలు నిబంధనలు పాటించని థియేటర్లను సీజ్ చేస్తున్నారు అధికారులు. అయితే ప్రభుత్వ తీరుపై ఆందోళనకు దిగుతున్నారు ఎగ్జిబిటర్లు. కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ఎగ్జిబిటర్లు మండిపడుతున్నారు.
ఈ నేపథ్యం లోనే ఇవాళ విజయవాడ లో అత్యవసర సమావేశం కావాలని నిర్ణయం తీసు కున్నారు ఎగ్జిబిటర్లు. బీసీ సెంటర్ల లో ప్రస్తుత టికెట్ ధరలతో థియేటర్లను నడపలేమని చెబుతున్నారు యజమానులు.
ముఖ్యంగా చిత్తూరు జిల్లా సినిమా థియేటర్లపై అధికారుల ఉక్కు పాదం మోపుతున్నారు. ఈ నేపథ్యం లోనే మదనపల్లి లో ఏడు సినిమా థియేటర్లు, కుప్పంలో నాలుగు సినిమా థియేటర్ల మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు అధికారులు. మదనపల్లె సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు థియేటర్లను మూసివేయిస్తున్నారు రెవెన్యూ అధికారులు.. దీంతో థియేటర్ల వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది…