అక్సర్ పటేల్ వరల్డ్ రికార్డ్.. ఐదు వికెట్లు సాధించిన ఫాస్టెస్ట్ స్పిన్నర్

-

కాన్పూర్ టెస్టులో టీమ్ ఇండియా ఆల్ రౌండర్ అక్సర్ పటేల్ రికార్డులను తిరగరాశాడు. టెస్టు క్రికెట్‌ చరిత్రలో అతి తక్కువ సమయంలో ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన ఫాస్టెస్ట్ స్పిన్నర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. కేవలం నాలుగు టెస్టు మ్యాచ్‌ల ఆడిన అక్సర్ పటేల్ ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టడం విశేషం. అతడి కంటే ముందు ఆస్ట్రేలియా స్పిన్నర్ హెర్బర్ట్ హూర్డెర్స్ పేరిట ఆ రికార్డు ఉండేది. అతను ఏడు టెస్టు మ్యాచులు ఆడి ఐదు వికెట్ల ఫీట్‌ను సాధించాడు. శనివారం న్యూజిలాండ్‌ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అక్సర్ పటేల్ ఐదు వికెట్లు తీశాడు.

34 ఓవర్లు వేసిన అక్సర్ పటేల్ 62 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లను పడగొట్టాడు. వికెట్ నష్టపోకుండా మూడో రోజు ఆట మొదలు పెట్టిన న్యూజిలాండ్ బ్యాటర్లను తన స్పిన్ మాయాజాలంతో కట్టడి చేశాడు. 95 పరుగులతో సెంచరీకి చేరువైన లాథమ్‌ను ఔట్ చేయడంతో అక్సర్ వికెట్ల వేట మొదలైంది. రాస్ టేలర్, హెన్రీ నికోలస్, టామ్ బ్లండల్, సౌథీలను పెవిలియన్‌కు చేర్చి ఐదు వికెట్ల ఫీట్‌ను సాధించాడు.

Read more RELATED
Recommended to you

Latest news