Ayodhya: రామాలయానికి విరాళం పేరిట ‘QR Code’ మోసం.. VHP హెచ్చరిక

-

యావత్ భారతావని ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తోన్న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సన్నాహాకాలు జరుగుతున్నాయి. జనవరి 22 న అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జరుగునుంది. వీటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని ముఠాలు రామాలయానికి విరాళాల పేరుతో భక్తుల వద్ద నుండి డబ్బులు దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలో క్యూఆర్ కోడ్, ఇతర విధానాలను అనుసరిస్తున్నారని అయోధ్య విశ్వహిందూ పరిషత్ హెచ్చరించింది.

అయోధ్యలో రామమందిర నిర్మాణమునకు సంబంధించిన వివిధ పనులను శ్రీరామ జన్మభూమి తీర్త్ క్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షిస్తుంది. విరాళాలు సేకరించేందుకు ఎవ్వరికీ అధికారం ఇవ్వలేదని విశ్వహిందూ పరిషత్ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ వెల్లడించారు. కాగా,సోషల్ మీడియాలో మాత్రం రామాలయం పేరుతో తప్పుడు పేజీలు సృష్టిస్తున్నారని ఆయన తెలిపారు.ఆలయ ప్రారంభోత్సవం పేరు చెప్పి ప్రజలను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఫోన్ యూపీఐ,క్యూఆర్ కోడ్ ల ద్వారా ఆలయానికి విరాళాలు ఇవ్వాలని అడుగుతున్నట్లు ఓ మోసపూరిత పేజీని ఉదహరిస్తూ ఎక్స్లో పోస్టు చేశారు. ఇటువంటి విషయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version