బాబు-జగన్ టూర్లు..సక్సెస్ అవుతుంది ఎవరు?

-

ఏపీలో పోలిటికల్ ఫైట్ హాట్ హాట్‌గా నడుస్తోంది. వైసీపీ వర్సెస్ టీడీపీ పోరు తీవ్ర స్థాయిలో నడుస్తోంది. జగన్ వర్సెస్ చంద్రబాబు వార్ నువ్వా-నేనా అన్నట్లు సాగుతుంది. నెక్స్ట్ ఎన్నికల్లో ఇద్దరు నాయకులు అధికారం కోసం ఇప్పటినుంచే పదునైన వ్యూహాలు, ప్రత్యర్ధులపై పై చేయి సాధించడం, పార్టీని బలోపేతం చేసుకోవడం, ప్రజల మద్ధతు పెంచుకోవడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు.

షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. కానీ ముందస్తు ఎన్నికలు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. దీంతో అటు జగన్, ఇటు చంద్రబాబు జనంలోకి వెళ్లిపోతున్నారు. ఎవరికి వారు సెపరేట్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఓ వైపు అసెంబ్లీ స్థానాల్లో బలమైన అభ్యర్ధులని నిలబెట్టేలా ప్లాన్ చేసుకుంటూ, మరో వైపు నేతలని ప్రజల్లో తిప్పుతున్నారు. గడపగడపకు అని వైసీపీ, బడుదేబాదుడు, ఇదేం ఖర్మ అంటూ టీడీపీ నేతలు ఇంటింటికి తిరుగుతున్నారు. ఇక చంద్రబాబు, జగన్‌లు సైతం టూర్లు వేస్తున్నారు.

గ్యాప్ లేకుండా బిజిబిజిగా గడుపుతూ ప్రజా మద్ధతు పెంచుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే పథకాల ప్రారంభం, అభివృద్ధి కార్యక్రమాల శంఖుస్థాపనల పేర్లతో జగన్ భారీ సభలతో ప్రజల్లో ఉంటున్నారు. ఇటీవల పలు జిల్లాల్లో పర్యటించారు. ఈ మధ్య పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించారు..ఇంకా చిత్తూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. జగన్ రాక సందర్భంగా వైసీపీ శ్రేణులు జనాలని సమీకరించి..భారీ సభలు ఏర్పాటు చేస్తున్నారు.

అటు చంద్రబాబు సైతం బాదుడేబాదుడు, ఇదేం ఖర్మ కార్యక్రమాలతో రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఆ మధ్య గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో పర్యటించారు..ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్ర్యటిస్తున్నారు. తర్వాత విజయనగరం, కృష్ణా జిల్లాల్లో టూర్ ప్లాన్ చేస్తున్నారు. ఇక బాబు రోడ్ షోలు, సభలకు భారీ స్థాయిలో జనం వస్తున్నారు. అంటే జగన్‌కు, బాబుకు జన స్పందన భారీగా ఉంది. అటు పవన్‌కు భారీ మద్ధతు వస్తుంది. మరి చివరికి ప్రజలు ఎవరి వైపు ఉండి సక్సెస్ చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news