ఫ్యామిలీ పాలిటిక్స్..జగన్‌తో మనకేంటి..!

-

రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఊహించలేము..ఫ్యామిలీలు సైతం రాజకీయాలు వల్ల సెపరేట్ అయిపోతాయి. రాజకీయాలకు అంత పవర్ ఉందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు వైఎస్సార్ ఫ్యామిలీ పరిస్తితి కూడా అలాగే ఉంది. వైఎస్సార్ చనిపోయాక కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి జగన్ వైసీపీ పెట్టారు. ఆ పార్టీ పెట్టి అనేక ఒడిదుడుకులు ఎదురుకుని చివరికి సక్సెస్ అయ్యి సీఎం అయ్యారు.

అయితే జగన్ సక్సెస్‌లో తన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల పాత్ర కూడా ఉంది. జగన్ జైలుకు వెళ్లినప్పుడు వారిద్దరే పార్టీని నడిపించారు. ఉపఎన్నికల్లో పార్టీని గెలిపించారు. ఇక అన్న పార్టీ కోసం షర్మిల పాదయాత్ర కూడా చేశారు. అలాగే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం షర్మిల, విజయమ్మలు కష్టపడ్డారు. జగన్ గెలిచి అధికారంలోకి వచ్చారు..దీంతో షర్మిల, విజయమ్మలకు కీలక పదవులు దక్కుతాయని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా షర్మిల..తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వైఎస్సార్టీపీ పెట్టి అక్కడ రాజకీయం చేస్తున్నారు. అయితే తన అన్నతో విభేదాలు వల్ల తెలంగాణకి వెళ్ళారా? లేక పరోక్షంగా అన్న సపోర్ట్ ఉండటం వల్ల అటు వెళ్ళారా? అనేది క్లారిటీ లేదు.

అయితే టీడీపీ విమర్శలు చూస్తే..మళ్ళీ తన పార్టీలో షర్మిలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి జగనే..ఆమెని సైడ్ చేశారని టీడీపీ నేతలు అంటున్నారు. అదే బాటలో తల్లిని కూడా తప్పించేశారని చెబుతున్నారు. ఆమెని కూడా తెలంగాణకు పంపించేసారని అంటున్నారు. ఇలా షర్మిల పార్టీకి అండగా తెలంగాణలో విజయమ్మ పనిచేస్తున్నారు.

ఇక తాజాగా షర్మిల ఇష్యూపై మీడియా విజయమ్మని జగన్ గురించి ప్రశ్నించింది. తెలంగాణలో జరిగిన పరిణామాలపై జగన్ ఏమైనా మాట్లాడారా… ఎంతైనా సిస్టర్ కదా? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. అందుకు విజయమ్మ స్పందిస్తూ, ‘ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో, ఆ రాష్ట్రంతో మనకేంటమ్మా’ అంటూ నవ్వుతూ బదులిచ్చారు.  అంటే జగన్‌ జోక్యం వస్తే తెలంగాణలో రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని చెప్పి విజయమ్మ తెలివిగా సమాధానం ఇచ్చినట్లు కనిపిస్తున్నారు. మొత్తానికి వైఎస్సార్ ఫ్యామిలీ పాలిటిక్స్ ఊహించని విధంగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news