షాకింగ్‌ న్యూస్‌ : నవజాత శిశువు కడుపులో 8 పిండాలు

-

ప్రపంచ వైద్య చరిత్రలోనే ఇది వింత. పుట్టి నెల రోజులు కూడా కాని ఓ శిశువు నుంచి 8 పిండాలను వైద్యులు తొలగించారు. అత్యంత అరుదైన ఈ ఘటన ఝార్ఖండ్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాంచీలోని రామ్‌గఢ్‌లో అక్టోబరు 10న ఓ పాప జన్మించింది. ఆ తర్వాత ఆ చిన్నారి కడుపు నొప్పితో బాధపడుతుండడంతో తల్లిదండ్రులు ఆమెను స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. సీటీ స్కాన్ నిర్వహించిన వైద్యులు కడుపులో కణితులు ఉన్నట్టు గుర్తించారు. అనంతరం 21 రోజులు పర్యవేక్షణలో ఉంచారు. తాజాగా, ఈ నెల 1న కణితులు తొలగించేందుకు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ చేస్తున్న వైద్యులు లోపల కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు.

First baby born with novel three-parent embryo technique

అవి కణితులు కావని, సరిగా అభివృద్ధి చెందని పిండాలని గుర్తించారు. గంటన్నరపాటు ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు. శిశువుల పొట్టలో అభివృద్ధి చెందని పిండాలు వెలుగు చూసిన ఘటనలు ప్రపంచవ్యాప్తంగా వందలోపే ఉన్నట్టు ఈ సందర్భంగా వైద్యులు తెలిపారు. ఆయా కేసుల్లో ఒక పిండాన్ని మాత్రమే తొలగించారని, కానీ నవజాత శిశువులో ఏకంగా 8 పిండాలు ఉన్నాయని, ఇలాంటి ఘటన ప్రపంచంలో ఇదే మొదటిదని వైద్యులు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news