టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. ఏం జరిగిందంటే?

-

బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను టీమిండియా విజయవంతంగా పూర్తి చేసింది. రెండు మ్యాచుల సిరీస్‌ను 2-0 తేడాతో ముగించింది.ఈ సిరీస్‌తో భారత జట్టు పలు రికార్డులను సైతం క్రియేట్ చేసింది. డబ్ల్యూటీఐ చాంపియన్ షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించేందుకు టీమిండియా మరో రెండు విజయాలు సాధిస్తే సరిపోతుంది.

ఈ క్రమంలోనే భారత జట్టు తన తదుపరి ప్రతిఘటనను ఆస్ట్రేలియా జట్టుతో ఎదుర్కొననుంది. 5 మ్యాచుల టెస్టు సిరీస్‌ను టీమిండియా నవంబర్ 22 నుంచి ఆడనుంది.ఈ నేపథ్యంలో భారత జట్టుకు భారీ షాక్ తగిలింది.ఆ జట్టు స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఆసీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు దూరం కానున్నట్లు సమాచారం. షమీ మోకాళ్లలో వాపు వచ్చిందని, అతడు నేషనల్ క్రికెట్ అకాడమీలో బీసీసీఐ మెడికల్ బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు ఓ జాతీయ మీడియా వెల్లడించింది. ఇక మహ్మద్ షమీ కోలుకునేందుకు 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version