ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం బ్యాడ్ న్యూస్..!

-

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో ఇప్ప్పటికప్పుడు ఏదో ఒక మార్పు చేస్తుంది. తాజాగా తీసుకున్న నిర్ణయం తో ఉద్యోగులకి షాక్ తగిలింది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. కరోనా సమయంలో నిలిపివేసిన డీఏ గురించి క్లారిటీ ఇచ్చింది. 18 నెలల కాలానికి సంబంధించిన డీఏ ని చెల్లించమని అంటోంది. అయితే కరోనా టైం లో ఆర్థిక పరిస్థితి కారణంగా డియర్‌నెస్‌ అలవెన్స్‌ను నిలిపివేసింది కేంద్రం.

2020 జనవరి 1 నుంచి 2021 జూన్ 30 వరకు చెల్లించాల్సిన డీఏ పెండింగ్ లో వుంది. ఆర్థిక పరిస్థితి బాగున్నాక దీన్ని ఇస్తారని అంతా భావించారు. కానీ ఇది చెల్లించే పరిస్థితి లేదుట. కాంగ్రెస్ సభ్యుడు నరేన్ భాయ్ జే రావత్‌ రాజ్యసభలో ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరీ ని అడగగా.. నిలిపివేసిన ఆ 18 నెలల డీఏ ని చెల్లించమని 2020-21 ఆర్థిక సంవత్సరం తర్వాత కూడా పరిస్థితుల్లో ఏ మార్పు లేకపోవడంతో 18 నెలల డీఏ బకాయిలు చెల్లించమని చెప్పారు.

కానీ నిజానికి ఏడాదికి రెండు సార్లు డీఏలు పెంచుతారు. ఆరు నెలలకు ఒకసారి పెరుగుతూ వస్తుంది. కానీ కరోనా సమయంలో పెంచలేదు. మూడు సార్లు కూడా స్థిరంగానే కొనసాగింది. అందుకే గత మూడు డీఏలు చెల్లించాలని ఉద్యోగులు అంటున్నారు. 2021 జులైలో డియర్‌నెస్ అలవెన్స్‌ని మళ్ళీ ఇవ్వడం మొదలు పెట్టింది. 1 జూలై 2021 నుండి డీఏ ని 11 శాతం పెంచింది. తరవాత జూలై 2021 నుండి డీఏ ని 17 శాతం నుండి 28 శాతానికి పెంచారు. ఇప్పుడు ఇది 38 శాతంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version