తప్పకుండా నిన్ను ’ టచ్ ‘ చేసి చూపిస్తాం…కేసీఆర్ కు బండి సవాల్..

’నిన్ను తప్పకుండా టచ్ చేసి చూపిస్తాం.. నిన్ను నిద్ర పోనీయం.. మేం  నిద్ర పోం‘ అంటూ బండి సంజయ్ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఈ రోజు యుద్దం మొదలుపెట్టాం అంటూ కౌంటర్ ఇచ్చారు. గత ఏడేళ్లుగా తెలంగాణ లో రైతుల వడ్లు కోనుగోలు చేసింది కేంద్రం కాదా..? అని ప్రశ్నించారు. కేంద్రమే కొనుగోలు చేసి ఉంటే వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ’నీకు కోసం వస్తే నీ కార్యకర్తలు భయపడుతారేమో.. కానీ బీజేపీ భయపడదని‘ హెచ్చరించారు. 

దేశంలో 22 రాష్ట్రాలు పెట్రోల్, డిజిల్ రేట్లు తగ్గించాయి.. మరి నువ్వేందుకు తగ్గించవని ప్రశ్నించారు. మొత్తం తెలంగాణ అంతా దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అమలు చేసే దాకా వదిలిపెట్టేది లేదన్నారు. కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమేది.. ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహం ఏదని ప్రశ్నించారు బండి సంజయ్. పేదలు, దళితుల కోసం నేను నామెడలు నరుక్కోవడానికైానా సిద్ధం అని.. ప్రగతి భవన్ రమ్మంటావా..ఫామ్ హౌజ్ రమ్మంటావా.. అని సవాల్ విసిరారు బండి సంజయ్.