అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం మార్చాలన్న కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి : బండి సంజయ్

-

భాగ్యనగరం నడిబొడ్డున ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు బీజేపీ పోరాటంతోనే సాధ్యమైందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. దళితులకు రాష్ట్ర ప్రభుత్వం చేసింది శూన్యమని విమర్శించారు. దళితబంధు పేరుకే గానీ అమల్లో ఎక్కడా లేదని ఆరోపించారు. దమ్ముంటే రాష్ట్ర సర్కార్ దళిత బంధుపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో బండి సంజయ్ పాల్గొన్నారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి బీజేపీ శ్రేణులతో కలిసి  నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.

మరోవైపు అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ మరోసారి తప్పుబట్టారు. కేసీఆర్ దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌ ఎన్ని జిమ్మిక్కులు చేసినా దళితులు ఆయణ్ను నమ్మే పరిస్థితి లేదని తెగేసి చెప్పారు

Read more RELATED
Recommended to you

Exit mobile version