బండి సంజయ్: నా ఫోన్ దొరికే వరకు విచారణకు పిలవద్దు..

-

ఇటీవల కొద్ది రోజుల క్రితం టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల సమయంలో వరుసగా తెలుగు మరియు హిందీ పేపర్ లు లీక్ అయిన విషయం తెలిసిందే. అయితే హిందీ పేపర్ లీక్ అయిన విషయంలో కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రమేయం ఉందని అరెస్ట్ చేసి మళ్ళీ బెయిల్ మీద విడుదల చేశారు. కాగా తాజాగా కమలాపురం పోలీసులు బండిని విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు బండి సంజయ్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు వైరల్ గా మారింది.

ఈయన రిప్లై ఇస్తూ ఒక బాధ్యతగల ఎంపీగా ఉన్న నాపై నిరాధార ఆరోపణలు చేయడం తగదన్నారు. నా ఫాంట్ పోయి నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను. నా ఫోన్ దొరికే వరకు నన్ను విచారణకు పిలవలకండి అంటూ స్మార్ట్ గా కమలాపురం పోలీసులు పంపిన నోటీసులకు రిప్లై ఇచ్చాడు. మరి ఈ రిప్లై మీద కమలాపురం పోలీసులు ఏ విధంగా రెస్పొంద్ అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news