సాధారణంగా వర్షాకాలంలో గుంతలు మరియు మ్యాన్ హోల్స్ ల వలన చాల ప్రమాదాలు జరగడం మనము చూస్తూనే ఉంటాము. ఇలాంటి సమయంలోనే ప్రభుత్వం ఈ గుంతలు అన్నీ పూడ్చేలాగా చర్యలు తీసుకోవాలి. తాజాగా తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో జరిగిన దుర్ఘటన వలన జూబిలీహిల్స్ కు చెందిన వివేక్ అనే పసిబాలుడు మృతి చెందాడు. దీనిపై విపక్ష నాయకుడు బండి సంజయ్ తనదైన శైలిలో రెచ్చిపోయి మాట్లాడాడు. నగరంలో ఈ విధంగా గుంతలు ఏర్పడుతుంటే ప్రభుత్వం ఏమిచేస్తుంది అంటూ మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ పై మండిపడ్డాడు.
అకాల వర్షాలకు మహానగరం తడిసి ముద్దయ్యి ఎందరో పిల్లల ప్రాణాలను హరిస్తోంటే ప్రభుత్వానికి ఏమీ పట్టడం లేదా అంటూ దుయ్యబట్టారు. ఇకపైన ఇలా జరగకుండా చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వానిది అని హెచ్చరించారు. కాగా ప్రజలు కూడా తమ ఇంటి వద్ద ఉంటే గుంతల దగ్గరకు పిల్లలు పోకుండా చూసుకోవాలని సలహా ఇచ్చారు.