ప్రజాసంగ్రామ పాదయాత్ర ఎట్టి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తే లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. అరెస్ట్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రజాసంగ్రామయాత్ర యాధావిధిగా భ్రదకాళి ఆలయం వరకు కొనసాగుతుందని.. శాంతియుతంగా నిర్వహిస్తున్న పాదయాత్రను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికే తీరని మచ్చ అన్నారు. అధికార టీఆర్ ఎస్ పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజాసంగ్రామయాత్ర కొనసాగి తీరుతుందని పేర్కొన్నారు.
టీఆర్ ఎస్ పార్టీ వైఫల్యాలను, అవినీతి అక్రమాలను ఎండగడుతూనే ఉంటాం. ఆపే ప్రసక్తే లేదన్నారు. పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్న టీఆర్ ఎస్ పార్టీపై న్యాయపరంగా పోరాటం చేస్తామని..
ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు అవినీతి అక్రమాలు బయటపెడుతున్నందుకే పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాదయాత్రకు భద్రత ఇవ్వాల్సిన బాధ్యత పోలీస్‌శాఖదేనని.. టీఆర్ ఎస్ పార్టీ ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా శాంతియుతంగా గాంధేయ పద్ధతిలో తమ నిరసనను వ్యక్తం చేయాలని బిజెపి శ్రేణులకు పిలుపునిచ్చారు బండి సంజయ్. ముఖ్యమంత్రి అవినీతి భండారం వైఫల్యాలు బయటపెడుతున్నామనే అక్కసుతోనే బిజెపి చేపట్టిన యాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు బండి సంజయ్.