బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొనసాగుతోంది. జవహర్ నగర్ లో దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు బండి సంజయ్. 8 ఏళ్ల టిఆర్ఎస్ పాలనలో తమకు ఎలాంటి న్యాయం జరగలేదని బండి సంజయ్ తో మొరపెట్టుకున్నారు దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు.
పింఛన్లు సమయానికి అందడం లేదని, నేరుగా అకౌంట్లో డబ్బులు పడడం లేదని, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి అండగా ఉంటామని.. వారి హక్కులకై ప్రభుత్వంపై పోరాటం చేస్తామని అన్నారు బండి సంజయ్. వచ్చే ఎన్నికలలో బిజెపి అధికారంలోకి వస్తుందని, బిజెపి ప్రభుత్వం వచ్చాక అర్హులను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు బండి సంజయ్. అనంతరం దివ్యాంగులు, వృద్ధులకు స్టిక్స్, స్టాండ్లను పంపిణీ చేశారు బండి సంజయ్.