తన ఛాంబర్ ను కూడా హ్యాండోవర్ చేసిన బండి సంజయ్‌

-

ఎన్నికల ముందు బీజేపీ అగ్రనాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా అనుకున్నట్లుగా.. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’లో ప్రసారమైన తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల మార్పుకు సంబంధించిన ప్రత్యేక కథనాలన్నీ అక్షరాలా నిజమయ్యాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అగ్రనాయకత్వం నియమించింది. రెండు మూడ్రోజుల్లో అధ్యక్ష పదవీ బాధ్యతలను కిషన్ రెడ్డి స్వీకరించనున్నారు. ఇక ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు తెలంగాణ ఎన్నికల నిర్వహణ ఛైర్మన్‌‌గా కేంద్రం నియమించింది. మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఎవరూ ఊహించని వ్యక్తిని బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. సీనియర్ నేత, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరిని రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించడం జరిగింది.

Keep Yadagirigutta temple away from politics: TRS activists to Bandi

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజీనామా చేసిన అనంతరం బండి సంజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ తనకు కేటాయించిన ఫార్చ్యూనర్ కారును స్టేట్ బీజేపీ ఆఫీసుకు పంపించారు. అంతేకాకుండా తన ఛాంబర్ ను కూడా హ్యాండోవర్ చేశారు. గతేడాది 2022లో టయోటా ఫార్చూనర్ బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని సంజయ్ కు కైటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఈ వాహానం కోసం పార్టీ తరుపున రెండుకోట్లు కేటాయించింది. తన అధ్యక్ష పదవి ముగియడంతో బండి సంజయ్ తిరిగి దానిని పార్టీకి అప్పగించారు.

Read more RELATED
Recommended to you

Latest news