దేశంలో ఉన్న మహిళలందరికీ బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి – మంత్రి సబిత

-

దేశంలో ఉన్న మహిళలందరికీ బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ సంస్కారం మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ వ్యాఖ్యలను ప్రతి మహిళా ఖండిస్తోందని, సంస్కారం మరిచి ఈర్షతో మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. వారి ఇంట్లో అమ్మ, భార్య ఉందని.. రాజకీయ జీవితంలో జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికారు.

కెసిఆర్, కేటీఆర్, కవితను తిట్టడం తప్ప బీజేపీ నేతలు చేసిందేమీ లేదని మండిపడ్డారు. కెసిఆర్ ని ఇబ్బంది పెట్టే యోజనలోనే కవితకు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ కోసం ఎమ్మెల్సీ కవిత చేపట్టిన ధర్నాకు మంచి స్పందన వచ్చిందని తెలిపారు. బిజెపి మహిళా రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మాట్లాడడం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో 50% రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దని అన్నారు. రిజర్వేషన్ లేకపోయినా మహిళను మేయర్ చేసిన ఘనత కెసిఆర్ దని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version