తెలంగాణలో శాంతి భద్రతలు లేవు..డీజీపీ ఫోన్ ఎత్తడం లేదు : బండి సంజయ్

-

టీఆర్‌ఎస్‌ సర్కార్‌, పోలీస్‌ శాఖ పై మరోసారి బీజేపీ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి లో బండి‌ సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం లో శాంతి భద్రతలు లేవని… డీజీపీ కి ఫోన్ చేస్తే ఎత్తడం లేదని ఫైర్ అయ్యారు.

తెలంగాణ ఏమైనా ఆఫ్ఘనిస్తానా, పాకిస్తానో అర్థం కావడం లేదన్నారు బండి సంజయ్. వానా కాలం ధాన్యం కొనాలని ఎఫ్ సీఐ, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనాలని ఒప్పందం జరిగిందని… అయినా రాష్ట్ర ప్రభుత్వం‌ చాలా ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభించలేదని ఫైర్‌ అయ్యారు.

టీఆర్ఎస్ కార్యకర్తలు కిరాయి గుండాలతో రైతులపై రాళ్లేశారని.. నెల రోజుల నుంచి కాంటాలు పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. పాలమూరు రైతులు పక్క రాష్ట్రం లో ధాన్యం అమ్ముకోవాల్సి‌న పరిస్థితి నెలకొందని… రైతు సమస్యలను మేం ప్రశ్నిస్తున్నామని స్పష్టం చేశారు బండి సంజయ్‌. రోడ్లపై, ఇళ్లలో ధాన్యం ఉందని… ధాన్యం ఎప్పుడు కొంటారో సీఎం కేసీఆర్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news