బంగార్రాజు టైటిల్ సాంగ్ టీజర్ రిలీజ్

-

కింగ్ నాగ‌ర్జున, నాగ చైత‌న్య ప్ర‌ధాన పాత్ర‌ల‌లో వ‌స్తున్న సినిమా బంగార్రాజ్. ఈ సినిమా నుంచి బంగార్రాజ్ టైటిల్ సాంగ్ టీజ‌ర్ ను తాజా గా చిత్ర బృందం విడుద‌ల చేసింది. వాసువాడ త‌స్స‌దియ్య అంటూ కింగ్ నాగ‌ర్జున, నాగ చైత‌న్య ఇద్ద‌రు క‌లిసి జాతిరాత్న‌లు ఫేం ఫ‌రియా అబ్ధుల్లా తో ఆడి పాడారు. దీనికి సంబంధించిన టీజ‌ర్ ను తాజా గా బంగార్రాజు చిత్ర బృందం విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం ఈ సాంగ్ విడుద‌ల చేసిన కొద్ది క్ష‌ణాల‌ల్లోనే సోషల్ మీడియా లో వైర‌ల్ అవుతుంది.

కాగ ఈ సాంగ్ లో ఫ‌రియా అబ్ధుల్లా డాన్స్ అంద‌రినీ ఆక‌ట్టు కుంటుంది. కాగ ఈ సాంగ్ లో తండ్రి కొడుకులు ఆడి పాడటం పై కూడా ఆస‌క్తి క‌నిపిస్తుంది. అయితే ఈ టైటిల్ సాంగ్ బంగార్రాజు సినిమా కు హైలైట్ గా మారే అవ‌కాశం ఉంది. కాగ బంగార్రాజు సినిమా త్వ‌ర‌లో నే తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాగ ఈ సినిమా ఇప్ప‌టి కే వ‌చ్చిన సోగ్గాడే చిన్ని నాయ‌నా సినిమాకు సిక్వెల్ గా తెర‌కెక్కుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version