BAN VS SL : తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ !

-

ఆసియా కప్ బరిలో ఇంకా మిగిలి ఉన్న నాలుగు జట్లలో ఎవరు కప్ ను గెలుచుకుంటారు అన్న విషయంపై ఇపుడు క్రికెట్ వర్గాలలో ఆసక్తిని రేపుతోంది. మొదటి నుండి ఫేవరెట్ గా ఉన్న ఇండియా , పాకిస్తాన్ మరియు శ్రీలంకలలో ఒకరు గెలిచే అవకాశం ఉంది. ఇక ఈ రోజు చావో రేవో మ్యాచ్ లో బంగ్లాదేశ్ కొలంబోలోని ప్రేమదాసుడ స్టేడియం లో శ్రీలంక తో తలపడనుంది. అందులో భాగంగా మొదట టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబుల్ హాసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ రోజు ఎలాగయినా గెలిస్తేనే ముందుకు వెళ్లనుంది. అందుకే షకీబ్ తన జట్టులో కూడా ఒక కీలక మార్పును చేసింది. లెఫ్ట్ హ్యాండెడ్ ప్లేయర్ అఫిఫ్ హుస్సేన్ కు బదులుగా జట్టులోకి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నసుమ్ అహ్మద్ ను తీసుకువచ్చింది.

ఇక శ్రీలంక మాత్రం గత మ్యాచ్ లో ఆడిన జట్టునే కొనసాగించడం విశేషం. మరి ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేయనున శ్రీలంక ఎంత టార్గెట్ ను బంగ్లా ముందు ఉంచుతుందో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version